మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Shani Ashtakam (Dasaratha Krutham) – శ్రీ శనైశ్చరాష్టకం (దశరథ కృతం)


దశరథ ఉవాచ |
కోణోఽంతకో రౌద్ర యమోఽథ బభ్రుః
కృష్ణః శనిః పింగల మంద సౌరిః |
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ || 1 ||

సురాసురః కింపురుషా గణేంద్రా
గంధర్వవిద్యాధరపన్నగాశ్చ |
పీడ్యంతి సర్వే విషమస్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 2 ||

నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీటపతంగభృంగాః |
పీడ్యంతి సర్వే విషమస్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 3 ||

దేశాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనానివేశాః పురపత్తనాని |
పీడ్యంతి సర్వే విషమస్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 4 ||

తిలైర్యవైర్మాషగుడాన్నదానై-
-ర్లోహేన నీలాంబరదానతో వా |
ప్రీణాతి మంత్రైర్నిజవాసరే చ
తస్మై నమః శ్రీరవినందనాయ || 5 ||

ప్రయాగకూలే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్ |
యో యోగినాం ధ్యానగతోఽపి సూక్ష్మ-
-స్తస్మై నమః శ్రీరవినందనాయ || 6 ||

అన్యప్రదేశాత్ స్వగృహం ప్రవిష్ట-
-స్తదీయవారే స నరః సుఖీ స్యాత్ |
గృహాద్గతో యో న పునః ప్రయాతి
తస్మై నమః శ్రీరవినందనాయ || 7 ||

స్రష్టా స్వయంభూర్భువనత్రయస్య
త్రాతా హరిః సంహరతే పినాకీ |
ఏకస్త్రిధా ఋగ్యజుః సామమూర్తి-
-స్తస్మై నమః శ్రీరవినందనాయ || 8 ||

శన్యష్టకం యః ప్రయతః ప్రభాతే
నిత్యం సుపుత్రైః పశుబాంధవైశ్చ |
పఠేచ్చ సౌఖ్యం భువి భోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణపదం పరం సః || 9 ||

ఇతి శ్రీదశరథ ప్రోక్తం శ్రీ శనైశ్చరాష్టకమ్ ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.